రేవంత్ పాలన గుడ్..41% మంది అభిప్రాయం ఇదే

రేవంత్ పాలన  గుడ్..41% మంది అభిప్రాయం ఇదే
  • కేసీఆర్ మరణాన్ని కోరటం సరికాదన్న 73 శాతం
  • ఓ ప్రధాన పార్టీ సర్వేలో కీలక అంశాలు వెల్లడి
  • సర్వే చేయించిన పార్టీకే షాక్ ఇచ్చిన రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: ఓ ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై చేయించిన సర్వే వాళ్ల నాయకత్వానికే షాకిచ్చేలా చేసింది. ప్రజా మద్దతు తమకే ఉందని భావించిన ఆ పార్టీ సర్వేకు ఉపక్రమించింది. ఇందులో ప్రధానంగా మూడు ప్రశ్నలను వారు సంధించినట్టు ప్రచారం జరుగుతోంది. రేవంత్ పాలన బాగుందా... కేసీఆర్ పాలన బాగుందా..? అన్న ప్రశ్నకు 41.1% మంది రేవంత్ పాలన మెరుగ్గా ఉందంటూ సమాధానం ఇచ్చారు.  

అదే సమయంలో 37.5 శాతం మంది కేసీఆర్-బీఆర్ఎస్ పాలన బాగుందని అభిప్రాయపడినట్లు తెలిపింది. 21.4 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదని సర్వే పేర్కొంది.

రేవంత్ అప్రోచ్ కరెక్ట్

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పొలిటికల్ అప్రోచ్ ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు 63.5% మంది బాగుందని చెప్పినట్టు వెల్లడైంది. 17.8% మంది బాగా లేదని, 18.7 శాతం మంది స్పందించలేదు. కొందరు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారు.

 ఇది సబబేనా అని అడిగిన ప్రశ్నలకు 73.1% మంది సరికాదని అన్నారు. 7.2% మంది సముచితమేనని, 19.7 శాతం మంది స్పందించలేదని వెల్లడించింది. కేసీఆర్ నివాసంపై దాడిని 55.8% మంది వ్యతిరేకించారు. 

25.7 శాతం మంది మద్దతు పలికారు. 18.5% మంది స్పందిచకపోవడం గమనార్హం. రేవంత్ పాలనపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తున్నా హామీల అమలుపై ఏకాభిప్రాయం ఉన్నట్టు కనిపించలేదని సర్వే తెలిపింది.