సెప్టెంబర్17న ప్రజా పాలనా దినోత్సవం...పబ్లిక్ గార్డెన్ లో విస్తృత ఏర్పాట్లు

సెప్టెంబర్17న ప్రజా పాలనా దినోత్సవం...పబ్లిక్ గార్డెన్ లో విస్తృత ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17న నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్​లో నిర్వహించే  తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సంజయ్ జాజు తెలిపారు. గురువారం నిర్వహణ ఏర్పాట్లపై  సెక్రటేరియెట్​లో సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ 17 న ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు వస్తారని తెలిపారు.

నగరంలోని పలు ప్రధాన భవనాలకు, చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని సూచించారు. ఈ నెల 15 న పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు  రెండు వేల మంది  హాజరవుతారని పేర్కొన్నారు.