ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు

ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు

ఇటీవల టీవీ చర్చలో భాగంగా ముహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఆరేళ్ల పాటు అమెను పార్టీ నుంచి బహిష్కరించింది. నూపుర్‌ శర్మతో పాటు నవీన్‌జిందాల్‌ ను  ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది.

సస్పెండ్ అనంతరం నూపుర్‌ శర్మ ట్విట్టర్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు.. "నా మాటలు ఎవరికైనా అసౌకర్యం కలిగించినా లేదా మతపరమైన భావాలను గాయపరిచినా, నేను బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు." అని అమె తన ట్వీట్ లో రాసుకొచ్చింది.

కాగా మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమె వ్యాఖ్యలను నిరసిస్తూ కాన్పూర్‌లో చేపట్టిన ఆందోళనల్లో భారీ హింస చెలరేగింది. దీనితో అమెపై ముంబై తదితర ప్రాంతల్లో కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో హైకమాండ్ నూపుర్‌ శర్మను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

 

మరిన్ని వార్తల కోసం... 

నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ

జో రూట్ 10,000 పరుగులు