నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ

నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆదివారం (జూన్ 5న) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి నూపుర్ ను బహిష్కరించారు. నూపుర్ శర్మతో పాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌‌ ను కూడా తొలగించారు. పార్టీలో వీరికి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ మహ్మాద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వల్లే కాన్పూర్‌లో అల్లర్లు జరిగాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నూపుర్ శర్మపై ముంబైతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. 

 

నూపుర్ శర్మ ప్రకటనతో తలెత్తిన వివాదంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ మతం లేదా వర్గం మనోభావాలను దెబ్బతీసే అలాంటి ఆలోచనలను తమ పార్టీ అంగీకరించదని తెలిపారు. తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అనంతరమే నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌‌ ను  పార్టీ నుంచి తొలగించారు.

 

మరిన్ని వార్తల కోసం..

మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్

పిలిచి ముఖం చాటేసిన మంత్రిపై సర్పంచ్‌‌ల ఆగ్రహం

మొట్టమొదటి సారిగా మహిళల కోసమే..