‘మిషన్ భగీరథ’ మీదని ప్రచారం చేసుకుంటారా ?

‘మిషన్ భగీరథ’ మీదని ప్రచారం చేసుకుంటారా ?

‘జల్ జీవన్ మిషన్’ పథకంలో భాగంగా తెలంగాణలోని 54 లక్షలకుపైగా ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామంటూ కేంద్ర జలశక్తి శాఖ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘‘కేంద్ర సర్కారు సిగ్గు లేకుండా.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మిషన్ భగీరథ’ పథకాన్ని తనదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది’’ అని ఆయన విమర్శించారు.

మిషన్ భగీరథకు రూ.19,000 కోట్లు ఇవ్వొచ్చని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా.. కేంద్ర సర్కారు ఒక్క పైసాను కూడా విదిల్చలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడదే పథకాన్ని తనదిగా చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘షేమ్ ఆన్ యూ ఎన్పీఏ గవర్నమెంట్’ అని కామెంట్ చేశారు. తెలంగాణలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించిన గణాంకాలతో  కేంద్ర జలశక్తి శాఖ చేసిన ట్వీట్ ను తన పోస్ట్ లో కేటీఆర్ ట్యాగ్ చేశారు.  

మరిన్ని వార్తలు..

విరాటపర్వం ట్రైలర్ అదుర్స్

ఆయన చేతిలో పైసా పడితే తప్ప.. నోరు తెరవరు