
టీమిండియాలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ జట్టు కోసం ఎంతలా పరితపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా అలసిపోకుండా వేస్తాడు. రెస్ట్ లేకుండా మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ లు ఆడిన సిరాజ్.. ఆ తర్వాత మొత్తం ఐపీఎల్ ఆడాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తన బెస్ట్ ఇస్తున్నాడు. సిరాజ్ పట్టుదలను ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ప్రశంసించాడు. ఈ టీమిండియా పేసర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.
ఇండియా, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత సిరాజ్ గురించి రూట్ మాట్లాడాడు. " సిరాజ్ ఒక నిజమైన యోధుడు. ప్రతి జట్టు అలాంటి ప్లేయర్ ఉండాలని కోరుకుంటుంది. జట్టు కోసం తన 100 శాతం ఇస్తాడు. అతనికి తగిన గుర్తింపు ఇవ్వాలి. గొప్ప వ్యక్తిత్వం కలవాడు". అని సిరాజ్ పై రూట్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ 26 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. రూట్ (105), బ్రూక్ (111) సెంచరీలతో మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకున్న మన జట్టు అదిరిపోయే ఆట ఆడింది. టీ విరామానికి ముందు బ్రూక్ ను ఔట్ చేసిన టీమిండియా ఆ తర్వాత చివరి సెషన్ లో బెతేల్ (5)తో పాటు సెంచరీ హీరో రూట్ (105)ను ఔట్ చేసి మ్యాచ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓవర్ టన్ (0), జెమీ స్మిత్ (2) ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 35 పరుగులు చేయాలి.
Joe Root compliments ‘warrior’ Mohammed Siraj and cheekily adds that he can see through his ‘fake anger’ to make out that he’s a really nice guy.#ENGvIND #JoeRoot #MohammedSiraj pic.twitter.com/L6UCKW9AQA
— Circle of Cricket (@circleofcricket) August 4, 2025