జర్నలిస్టుకు కఠిన జైలు శిక్ష.. ఏడాదిలో 10 గంటలే ఎండను చూడాలి..

జర్నలిస్టుకు కఠిన జైలు శిక్ష.. ఏడాదిలో 10 గంటలే ఎండను చూడాలి..

గూఢచర్యం ఆరోపణలతో దోషిగా తేలిన చైనీస్ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్.. పదేళ్ల జైలు జీవితంలో తను అనుభవించిన అత్యంత దయనీయ పరిస్థితులకు గురించి గుట్టు విప్పింది. చైనా స్టేట్  బ్రాడ్ కాస్టర్ లో పనిచేస్తూ గూఢచర్యం ఆరోపణలతో చైనీస్ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీని చైనా ప్రభుత్వం పదేళ్లు జైల్లో పెట్టింది. జైల్లో తను అత్యంత దయనీమైన స్థితిని ఎదుర్కొన్నట్లు చెంగ్ లీ తెలిపింది. 

48  సంవత్సరాల చెంగ్ లీని జాతీయ భద్రతా ఆరోపణలపై చైనా ప్రభుత్వం దోషిగా తేల్చింది. సరిగ్గా పది సంవత్సరాల వయసులో ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు వెళ్లింది. స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV అంతర్జాతీయ విభాగానికి పని చేయడానికి ఆమె చైనాకు తిరిగి వచ్చింది.గూఢచర్యం కేసులో దోషిగా తేల్చడంతో ఆమె గత పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆమెకు ఇంకా శిక్ష పడలేదు. 
ఆమె నిర్భంధంలో ఉన్నప్పటినుంచి బయటి ప్రపంచాన్ని చూడలేదు.. కుటుంబసభ్యులను కలవలేదు. స్కూల్ విద్యను అభ్యసిస్తున్న తన కూతురు, కొడుకు, ఆమె కుటుంబాన్ని కోల్పోతున్నట్లు చెంగ్ లీ స్థానిక మీడియా, ఆస్త్రేలియన్ దైత్యవేత్తకు తెలిపారు. అయితే తాను తిరిగి మన కుటుంబాన్ని, ఇంతకు ముందు నేను చూసిన బుష్ వాక్, నది, సరస్సు, ఈత, పిక్నిక్, నక్షత్రాలతో వెలిగిపోయే ఆకాశాన్ని తిరిగి చూస్తానని చెంగ్ తన భర్త నిక్ కోయిల్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను జైలుశిక్ష అనుభవరించిన పదేళ్లలో ప్రతి సంవత్సరంలో కేవలం 10 గంటల పాటు మాత్రమే ఎండలో నిలబడటానికి ఆమెకు అనుమతినిచ్చేవారని.. తన దయనీయ పరిస్థితి గురించి చెంగ్ వివరించింది. 

అయితే చెంగ్ లీ దయనీయ స్థితి పట్ల ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్.. ఆమె కుటుంబానికి దేశం నిరంతర మద్దతు, ఆమె శ్రేయస్సు కోసం పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. చెంగ్ లీ  సందేశం..  దేశం పట్ల ఆమెకున్న అమితమైన ప్రేమ తెలియజేస్తుంది.ఆస్ర్టేలియన్లందరూ ఆమె తిరిగి ఆమె కుటుంబ సభ్యులను కలవాలని కోరుకుంటున్నారని పెన్నీ వాంగ్ తెలిపారు. ‘‘చెంగ్ కోసం ఆస్ట్రేలియా ధాటిగా వాదిస్తోంది.. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చెంగ్‌కు న్యాయం, విధానపరమైన న్యాయమైన మానవీయ చికిత్స ప్రాథమిక ప్రమాణాలను తీర్చాలని కోరింది’’అని వాంగ్ చెప్పారు.