ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 నుంచి క్రేజీ అప్ డేట్

ఎన్టీఆర్  దేవర పార్ట్ 2 నుంచి క్రేజీ అప్ డేట్

ఎన్టీఆర్ హీరోగా  కొరటాల శివ రూపొందించిన ‘దేవర’చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. పార్ట్‌‌‌‌‌‌‌‌2కు లీడ్‌‌‌‌‌‌‌‌ను ఇస్తూ ముగింపు ఇవ్వడంతో ‘దేవర 2’ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి  ఎండింగ్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమాను స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

 ఇప్పటికే కొరటాల శివ  స్క్రిప్ట్ వర్క్, ప్రీ -ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా  సైఫ్ అలీఖాన్‌‌‌‌‌‌‌‌, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించనున్న  ఈ చిత్రాన్ని  ఎన్టీఆర్ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని  నిర్మించనున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇదిలా ఉంటే హృతిక్‌‌‌‌‌‌‌‌ రోషన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్నాడు. డిసెంబర్ చివరికల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.