సిటీలో పొపాయ్స్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సిటీలో పొపాయ్స్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : యూఎస్ రిటైల్ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొపాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియాలో ఆపరేట్ చేస్తున్న  జుబిలియెంట్ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ మొదటి స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. దీంతో దేశం మొత్తం మీద పొపాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోర్లు 18 కి చేరుకున్నాయి. తమ స్టోర్లలో ప్రైడ్ చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బర్గర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రైస్ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నగ్గెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి దొరుకుతాయని పొపాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌరవ్ పాండే అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తమ స్టోర్ల సంఖ్యను 50 కి పెంచుకుంటామని చెప్పారు. 

మాస్టర్ ఫ్రాంచైజి ఒప్పందంలో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పొపాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోర్లను ఆపరేట్ చేయడానికి జుబిలియెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు  వీలుంటుందని అన్నారు.  ఇండియాలో  ఆపరేట్ చేస్తున్న స్టోర్లు 70 శాతం వెస్ట్రన్ మెనూని, 30 శాతం లోకల్ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐటెమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆఫర్ చేస్తున్నాయని అన్నారు. వెజిటేరియన్స్ కోసం సపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫుడ్ ఐటెమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమ్ముతున్నామని అన్నారు.

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ గురించి మాట్లాడుతూ, ఇండియా వేగంగా ఎదుగుతోందని, ఇక్కడ బోలెడు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇతర కంపెనీలతో పోటీ పడుతూనే, విస్తరిస్తామని పేర్కొన్నారు.  చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోళ్ల ఫారాల నుంచి సేకరిస్తామని చెప్పారు. చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివిధ మసాలాలు దట్టించి  12 గంటల పాటు ఉంచుతామని, తమ దగ్గర ఫుడ్ ఐటెమ్స్ ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని గౌరవ్ అన్నారు. దేశం మొత్తం మీద 13 ఫ్యాక్టరీల్లో (కమిషనరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పొపాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ చేస్తుందని, హైదరాబాద్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెంగళూరులోని ఫ్యాక్టరీ నుంచి ఐటెమ్స్ వస్తాయని వివరించారు.