జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న లంకల దీపక్ రెడ్డిని ఎంపిక చేసింది పార్టీ హైకమాండ్. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇద్దరి ముగ్గురి పేర్లు పరిశీలించినా.. ఫైనల్ గా దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. 

ఇక లంకల దీపక్ రెడ్డి విషయానికి వస్తే.. 2023 ఎన్నికల్లోనూ ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆయన 25 వేల ఓట్లు సాధించి.. మూడో స్థానంలో నిలిచారు.

ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్... బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోకల్ కావటం ఆసక్తిగా మారింది. ఈ ముగ్గురు అభ్యర్థులు గత కొన్ని ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తూ వస్తున్నారు. స్థానికంగా ముగ్గురికి పట్టు ఉన్న ప్రాంతం కావటంతో.. ఉప ఎన్నిక ఆసక్తిగా.. ఉత్కంఠగా మారింది.