జూబ్లీహిల్స్ఉప ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 144 సెక్షన్ అమలు కానుంది.డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈసీ అధికారులు. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ALSO READ : జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్స్
ఉప ఎన్నిక కోసం పారమిలిటరీ కేంద్ర బలగాలు పహరా కాస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విధుల్లో 800 మంది కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులు డేగ కన్ను వేశారు. ఈ ఎన్నికలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది బరిలో నిలిచారు .
