జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్స్

జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్స్

జూబ్లీహిల్స్‌‌ బైపోల్‌ పోలింగ్ కొనసాగుతోంది.  నవంబర్ 11న  మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌‌ జరగనుంది.  మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందకు ఓటర్లు  క్యూ కడుతున్నారు. ​ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

 

బోరబండలోని పోలింగ్‌ బూత్‌లు పరిశీలించిన ఆర్‌వీ కర్ణన్‌

యూసఫ్ గూడలో పోలింగ్ కేంద్రం దగ్గర పోలింగ్ సరళిని పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

రహమత్ నగర్ డివిజన్ 165 పోలింగ్ స్టేషన్ లో మొరాయించడంతో  కొత్త EVM తెచ్చి పెట్టారు అధికారులు. పోలింగ్ కొనసాగుతోంది.  

షేక్ పేట డివిజన్ లోని  కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28, 29, 30 లో ఓటింగ్ సరళిని పరిశీలించిన బిజెపి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి..

షేక్ పేట డివిజన్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న డైరెక్టర్  SS రాజమౌళి

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో ఆమె ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌‌ జరగనున్నది. 

షేక్ పేట డివిజన్ వివేకానంద కాలనీ బూత్ నెంబర్ 31, 32, 33 వద్ద పోలీసులతో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ నాయకుడు  వాగ్వాదానికి దిగారు... నాలుగు బూతుల్లో పోలింగ్ సెంటర్ వద్ద టేబుల్స్ ఎక్కువగా ఏర్పాటు చేశారని వాగ్వాదానికి దిగడంతో  తొలగించారు పోలీసులు.

ఎన్నికల్లో మొదటిసారి అమల్లోకి వచ్చిన వచ్చిన అంశాలు

  • మొదటిసారిగా ఈవీఎం లో అభ్యర్థుల కలర్ ఫోటో
  • మొదటిసారి డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్న అధికారులు 
  • ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు
  • ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఏర్పాటు
  • మొదటిసారి పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచిన అధికారులు

 

జూబ్లీహిల్స్​పోలింగ్​కు భద్రత పెంపు

 జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్​లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్​కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్​బలగాలను మోహరించగా.. 1,761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచే అవకాశాలున్నాయి. యూసుఫ్‌‌‌‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, షేక్​పేట, ఫిల్మ్‌‌‌‌నగర్ తదితర ప్రాంతాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్ ఏరియాల్లోని లాడ్జీల్లో గెస్ట్ రిజిస్టర్లను చెక్​చేస్తున్నారు.

ఈ ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాయి.  కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకోగా, బీఆర్‌‌ఎస్ సెంటిమెంట్‌‌పై ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ మోదీ ప్రభ, హిందుత్వ అజెండానే విశ్వసిస్తున్నది.  కాంగ్రెస్​ రెండేండ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్లే 3 ప్రధానపార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.