హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా కొనసాగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు కూడా డ్రోన్లను వినియోగించారు. 900 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్లను సీపీ సజ్జనార్ మానిటరింగ్ చేశారు. రహమత్‌నగర్‌లోని పోలింగ్ బూత్ వద్ద డాగ్స్ స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల సామగ్రి, పోలింగ్ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించుకునేందుకు ఈ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
