ఒక్కరోజే కేజీకి రూ.15వేలు పెరిగిన వెండి.. ఎందుకీ సడన్ రైజ్?

ఒక్కరోజే కేజీకి రూ.15వేలు పెరిగిన వెండి.. ఎందుకీ సడన్ రైజ్?

యుద్ధం ముగింపుకు వస్తుందనే సంకేతాల మధ్య బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరగటం స్టార్ట్ చేశాయి. ప్రధానంగా వెండి ధర పెరగటానికి డాలర్ రేటు పతనంతో పాటు క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గటంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో ద్రవ్యోల్బణంపై ఇన్వెస్టర్లు తమ భయాలకు కళ్లెం వేస్తూ.. తిరిగి బెట్టింగ్ వేసేందుకు మెుగ్గుచూపుతున్నారు. దీంతో గడచిన కొన్ని వారాలుగా వీక్ అయిన మెటల్స్ తిరిగి బుల్ జోరుతో పెరగటమే బంగారం, వెండి ధరలను ప్రేరేపిస్తోంది. 

వెండి ధర మార్చి 25న కేజీకి రూ.15వేలు పెరిగింది దేశవ్యాప్తంగా మార్చి 24 రేట్లతో పోల్చితే. దీనికి ముందు కూడా మంగళవారం వెండి ధర స్థిరంగా ఉంది. గడచిన వారం రోజులుగా మూగబోయిన వెండి ధరల దూకుడు ప్రస్తుతం తిరిగి స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది. 

మార్చి 25న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, కడప, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లలో కేజీకి రూ.10వేలు పెరిగి రూ.2లక్షల 60వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర ఇవాళ రూ.260గా ఉంది. కొన్ని వారాల కిందట రూ.3లక్షలకు దగ్గరగా అమ్ముడైన వెండి ప్రస్తుతం యుద్ధం కారణంగా తగ్గుదలను చూసిందని నిపుణులు చెబుతున్నారు.