గ్రేటర్ వరంగల్, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజుల పాటు మూసి ఉంటుందని మార్కెట్ సెక్రటరీ మల్లేశం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 27న శ్రీరామనవమి, 28, 29 శని, ఆదివారాలు వారంతపు సెలవు ఉంటుందన్నారు. మార్కెట్ తిరిగి 30వ తేదీ సోమవారం పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు.
