బిగ్‌బాస్‌ షో గొడవపై పోలీసులు కేసు నమోదు

బిగ్‌బాస్‌ షో గొడవపై పోలీసులు కేసు నమోదు

హైదరాబాద్:  బిగ్‌బాస్‌ షో  ఫైనల్ అనంతరం హైదరాబాద్ లోని  అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అర్థరాత్రి జరిగిన గొడవపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై కేసులు బుక్ చేశారు. ఆరు బస్సులు, ఓ పోలీస్‌ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సీసీఫుటేజీ, వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితుల గుర్తింపు చేపట్టారు. దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తామని - పోలీసులు స్పష్టం చేశారు. 

బిగ్ బాస్-7 ఫైనల్ అనంతరం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర. అమర్‌దీప్, ప్రశాంత్‌ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమర్​దీప్ కారు అద్దాలను కూడా పగలగొట్టారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులను కూడా వదల్లేదు. కొంతమంది బస్సు అద్దాలు కూడా పగలుగొట్టారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఇక ‘బిగ్ బాస్ సీజన్–7 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. వంద రోజులకుపైగా సాగిన ఆటలో అతడిని విజయం వరించింది. ఆదివారం గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్–7 టైటిల్​ను పల్లవి ప్రశాంత్ దక్కించుకున్నాడని ప్రోగ్రాం హోస్ట్, హీరో నాగార్జున ప్రకటించారు. అమర్ దీప్ రన్నరప్​గా నిలిచారని వెల్లడించారు. 

ఒక సాధారణ యూట్యూబర్, రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి.  బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్​కు ట్రోఫీతో పాటు రూ.35 లక్షల చెక్‌ను నాగార్జున అందజేశారు. మారుతీ సుజుకీ బ్రెజా ఎస్​యూవీ కీ కూడా ఇచ్చారు. జోస్ అలుక్కాస్ నుంచి డైమండ్ జువెలరీ కొనుగోలు కోసం రూ.15 లక్షల చెక్ కూడా ఆ సంస్థ ఎండీ అందజేశారు.