కరోనా మందు పేరుతో మోసం..ముఠా అరెస్ట్

కరోనా మందు పేరుతో మోసం..ముఠా అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుకరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ పవర్​ పెంచే మెడిసిన్ ఇస్తామంటూ మోసం చేస్తున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో ఈ గ్యాంగ్ లక్ష రూపాయల ఫేక్​మెడిసిన్ ను అమ్మినట్టు గుర్తించారు. నిందితుల నుంచి రూ.2లక్షలు ఫేక్ మెడిసిన్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…

ఇమ్యూనిటీ పెంచుతామంటూ

ఆస్తమా, ఉబ్బసం రోగులకు ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని బ్రదర్స్ చేప ప్రసాదం పంపిణీ చేసే విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా శామీర్ పేటకు చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్  రాజ్ కుమార్(39) ఇంటి పేరు కూడా బత్తిని కావడంతో, దాన్ని ఆసరాగా చేసుకుని ఇమ్యూనిటీ పవర్​ పెంచే మెడిసిన్ పేరుతో మోసానికి ప్లాన్​చేశాడు. ఆర్కేపురానికి చెందిన నిడమర్తి ఉదయ్ భాస్కర్(50), నేరెడ్ మెట్ కి చెందిన మెరిగ మహీంద్ర(20),  సుచిత్రకు చెందిన పంపన సుబ్బారావు(50), సతీష్ రెడ్డితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. సుబ్బారావుకు ఎస్ఎస్ఈవీ నేచర్ ప్రొడక్ట్స్ పేరుతో ఫార్మా
ఉండడంతో అతడి ఇంట్లో ఫేక్ మెడిసిన్ తయారు చేయించిన ‘ నేచర్ కోవిడ్ అభయ్’  పేరు పెట్టారు. దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. 6 గ్రాముల మెడిసిన్​కు రూ.285 ఫిక్స్ చేశారు. ఫార్మా, బయో కంపెనీల పేరుతో లాక్ డౌన్ ఎసెన్సియల్ పాస్ లు తీసుకున్నారు. మహేంద్రను డెలివరీ బాయ్ గా పెట్టారు.15 రోజుల్లో  ఆన్ లైన్ లో వచ్చిన 300 ఆర్డర్లకు ఫేక్ మెడిసిన్​ డెలివరీ చేశారు.

హరినాథ్​గౌడ్ కంప్లయింట్​తో..

బత్తిని బ్రదర్స్​ పేరుతో సోషల్ మీడియాలో ఈ మెడిసిన్​ సర్య్కులేట్ అవుతుండడంతో బత్తిని హరినాథ్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు ఫేక్ మెడిసిన్​కు ఆర్డర్ పెట్టి, డెకాయ్ ఆపరేషన్​తో రాజ్​కుమార్,  ఉదయ్ భాస్కర్, మహీంద్ర, సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. సతీశ్ రెడ్డి పరారీలో ఉన్నాడు. 500 ఫేక్ మెడిసిన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో ఫేక్ లైసెన్స్ నంబర్ క్రియేట్ చేసినట్లు గుర్తించారు. తాము కరోనాకు మెడిసిన్ తయారుచేయలేదని, బత్తిని రాజ్ కుమార్ కి తమకు సంబంధం లేదని హరినాథ్​గౌడ్​ స్పష్టంచేశారు.

.