బోస్టన్ ఫెడరల్ కోర్టు H1B వీసా ఫీజుపై కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టేసింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడంతో అది చట్ట విరుద్ధ పన్నుగా కోర్టు పరిగణించింది. ఈ పన్ను చెల్లదని తీర్పునిచ్చింది.
$𝟭𝟬𝟬,𝟬𝟬𝟬 𝗛𝟭𝗕 𝗙𝗲𝗲 𝗢𝗿𝗱𝗲𝗿 𝗩𝗼𝗶𝗱𝗲𝗱 𝗯𝘆 𝗮 𝗝𝘂𝗱𝗴𝗲:
— Dr Ahmad Rehan Khan (@AhmadRehanKhan) June 8, 2026
A federal judge has struck down President Trump's requirement that employers pay a $100,000 fee for H-1B visa petitions.
In a 42-page ruling, U.S. District Judge Leo Sorokin held that the President lacked… pic.twitter.com/djn428nSVt
ఈ పన్నుపై అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని జడ్జి స్పష్టం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల అణిచివేతను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వలసలను పరిమితం చేసే అనేక చట్టాలు తెచ్చారు. ఇందులో H-1B వీసా జారీ, అధిక ఫీజులు ఉన్నాయి.
బోస్టన్‌కు చెందిన యు.ఎస్. డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్, ట్రంప్ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల రుసుము కేవలం ఒక సాధారణ రుసుము కాదని.. అది ఒక "పన్ను" అని అన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. కాంగ్రెస్ ఆమోదం లేకుండా కొత్త పన్నులు విధించడానికి అధ్యక్షుడికి చట్టపరమైన అధికారం లేదని గుర్తుచేశారు. తీర్పులో న్యాయమూర్తి సోరోకిన్ ఒక విషయం స్పష్టం చేశారు. ఈ లక్ష డాలర్ల చెల్లింపును మౌఖికంగా లేదా వ్రాతపూర్వకంగా ఏ పేరుతో పిలిచినా.. దాని ఉద్దేశం అది ఒక పన్ను అని నిరూపిస్తున్నాయని ఆయన తెలిపారు.
Reuters reports - "A federal judge on Monday struck down a $100,000 fee that U.S. President Donald Trump imposed on new H-1B visas for highly skilled foreign workers, concluding that it constituted an unlawful tax that Congress never authorized. U.S. District Judge Leo Sorokin… pic.twitter.com/QusSxu9eUH
— ANI (@ANI) June 8, 2026
H1B వీసా దరఖాస్తు ఛార్జీలను ట్రంప్ ప్రభుత్వం లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. H1B వీసా లాటరీ సిస్టమ్ను ఇప్పటికే తొలగించింది. H-1B వర్కర్ వీసాల కోసం కంపెనీలను సంవత్సరానికి లక్ష డాలర్లు చెల్లించాలని తెలిపింది. దీంతో.. భారత్, చైనా నుంచి అమెరికాకు వెళ్లే టెకీలపై తీవ్ర ప్రభావం పడింది.
