ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు: నిందితుల బెయిల్పై తీర్పు వాయిదా

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు: నిందితుల బెయిల్పై తీర్పు వాయిదా

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితుల బెయిల్పై తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచారని..ఆయనకు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని వాదించారు. ఈ కేసు చెల్లదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ కోరగా.. న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

రెండ్రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో.. రామచంద్రభారతి, సింహాయాజులు, నందకుమార్ లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులకు ఈ నెల 25వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో నిందితులను జైలుకు తరలించారు పోలీసులు.