
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఈ నెల 8న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాగా శుక్రవారం కేటీఆర్, హరీశ్‌రావు ములాఖత్ లో కవితను కలిశారు.