- మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాంస్కృతిక సారథిని ప్రగతి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గురువారం అంబేద్కర్ సచివాలయంలో సాంస్కృతిక సారథి వార్షిక ప్రగతి నివేదిక పుస్తకాన్ని చైర్‌పర్సన్ డాక్టర్ జి.వి. వెన్నెల గద్దర్‌తో కలిసి ఆవిష్కరించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీల ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు కళాకారుల వేతనాలను పెంచినట్టు తెలిపారు. కళాకారులకు వైద్య సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
