ఎప్పుడూ బిజీగా ఉండే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం కొల్లాపూర్లోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నారు. పంట సాగు కోసం కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ కు పూజలు చేసిన అనంతరం భూమి దున్ని ఆశ్చర్యపరిచారు.
అటు యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆర్టీసీ బస్సును నడిపారు. ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమైన సందర్భంగా ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం డిపో నుంచి ఆర్టీసీ బస్సును బస్టాండ్ వరకు నడిపించారు.- కొల్లాపూర్/యాదగిరిగుట్ట, వెలుగు:

