
గద్వాల, వెలుగు : కర్నాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం 5 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 318.516 మీటర్ల లెవెల్ ను మెయింటెన్ చేస్తున్నారు. 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 5 గేట్ల ద్వారా 20,180 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 36,674 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు, రైట్ కెనాల్ కు 485 క్యూసెక్కులతో కలిపి 57, 698 క్యూసెక్కులు వదులుతున్నారు.