
గద్వాల, వెలుగు : కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తుండడంతో జూరాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో జూరాల ప్రాజెక్ట్ ఏడు గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1041 ఫీట్లకు చేరుకుంది. జూరాల ప్రాజెక్ట్‌కు 82 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... ఏడు గేట్ల ద్వారా 46,760 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 31,700 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్ 1కు 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, రైట్ కెనాల్‌కు 340 క్యూసెక్కులు కలిపి మొత్తం మొత్తం 79,860 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.