జూరాల 12 గేట్లు ఓపెన్

జూరాల 12 గేట్లు ఓపెన్

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు 12 గేట్లను ఓపెన్  చేసి నీటిని దిగువకు వదులుతున్నారు.12 గేట్ల ద్వారా 1,16,424 క్యూసెక్కులు, విద్యుత్  ఉత్పత్తి ద్వారా 25,785 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్  లిఫ్ట్  ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్  కెనాల్  ద్వారా 550 క్యూసెక్కులు, రైట్  కెనాల్  ద్వారా290 క్యూసెక్కులు, ఆర్డీఎస్  లింక్  కెనాల్  ద్వారా 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం జూరాల ప్రాజెక్టు నుంచి 1,43,656 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు ఆఫీసర్లు తెలిపారు.