ముషీరాబాద్, వెలుగు: మహిళా బిల్లు ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరిగిందని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ప్రతిపక్షాల తిరుగుబాటుతో ఆ కుట్రకు తెరపడిందన్నారు. ఆదివారం కవాడిగూడలో ‘భారత రాజ్యాంగం’ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ సభలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నియంతృత్వ పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సామాన్య పౌరులకు తమ హక్కులపై అవగాహన కల్పించేందుకే రాజ్యాంగాన్ని తెలుగులోకి అనువదించినట్లు చెప్పారు.

