- తెలంగాణ లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు
ముషీరాబాద్,వెలుగు : విద్యార్థి దశ నుండే సమాజ ఉన్నతికి పాటుపడిన మహనీయుల చరిత్రను తెలపాలని తెలంగాణ లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు సూచించారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం, ఆర్ వీఎల్ ఎల్ బీఎస్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ సురేష్ సెట్కార్, జస్టిస్ సీవీ రాములు హాజరై విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. అనంతరం సీవీ రాములు మాట్లాడుతూ.. విద్యలో రాణించినప్పుడే సమాజం పురోగమిస్తుందని పేర్కొన్నారు. యోగ ద్వారా మానసిక ప్రశాంతత, మేధో శక్తి, విశ్వాసాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పట్టోళ్ల సంగమేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
