‘ఎక్సైజ్’ బదిలీల రగడ..కమిష నర్ తిట్ల దండకంతో డీసీకి గుండెపోటు

‘ఎక్సైజ్’ బదిలీల రగడ..కమిష నర్ తిట్ల దండకంతో డీసీకి గుండెపోటు

హైదరాబాద్​, వెలుగు:  ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అర్ధరాత్రి ఉన్నతాధికారి హోదాను మరిచి కమిషనర్  నిజామాబాద్ ఎక్సైజ్ డీసీ సోమిరెడ్డిని దుర్భాషలాడినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీలు చేయడం కుదరదని చెప్పినందుకు అందరి ముందే గంటపాటు తిట్ల దండకం అందుకున్నట్లు తెలిసింది.  

గంజాయి ముఠా దాడిలో చనిపోయిన కానిస్టేబుల్ సౌమ్య ఘటనను ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడటంతో సోమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై బీపీ డౌన్​కావడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా బీపీ పడిపోవడంతో పాటు బ్రెయిన్‌‌‌‌లో క్లాట్స్ ఏర్పడ్డాయని, గుండెపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని వైద్యులు నిర్ధారించారు.  

ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కమిషనర్ ప్రవర్తనపై తోటి అధికారులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బదిలీల ప్రక్రియ వెనుక అక్రమాలు, ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఆందోళనలు మిన్నంటుతాయని కమిషనర్ హుటాహుటిన బదిలీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎంకు, సీఎస్‌‌‌‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది.