సరిగ్గా 3 ఏళ్ల క్రితం.. 2023, జనవరి 23వ తేదీ.. అమెరికా దేశం సియాటిల్ సిటీ. అక్కడే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ లో జాహ్నవి కందుల అనే 23 ఏళ్ల అమ్మాయి.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతుంది. సియాటిల్ నగరంలోని థామస్ స్ట్రీట్ లోని డెక్ట్సర్ అవెన్యూ దగ్గర రోడ్డు దాటుతుంది. అదే సమయంలో అత్యంత వేగంగా వచ్చిన పోలీస్ కారు.. జాహ్నవి కందులను ఢీ కొట్టింది. 100 అడుగుల దూరంలో ఎగిరి పడిన జాహ్నవి కందుల.. అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనలో కారులోని పోలీసులు మాట్లాడిన మాటలు.. వ్యవహరించిన తీరు.. వారి నిర్లక్ష్యం.. జాత్యాహంకారం అనేవి ఆ తర్వాత.. విదేశీ విద్యార్థులపై అమెరికా పోలీసుల వైఖరి ఎలా ఉంటుంది అనేది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
ఆ ప్రమాదం ఎలా జరిగిందంటే.. :
సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న పోలీస్ అధికారి కెవిన్ డేవ్ కు ఓ కంప్లయింట్ వచ్చింది. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు అని.. ఆ కాల్ తీసుకున్న పోలీస్ అధికారి కెవిన్ డేవ్.. అత్యంత వేగంగా వెళుతున్న సమయంలో.. థామస్ స్ట్రీట్ లో రోడ్డు దాటుతున్న జాహ్నవి కందులను ఢీకొట్టాడు.
వాస్తవంగా ఆ రోడ్డుపై స్పీడ్ 40 కిలోమీటర్లు మాత్రమే. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కెవిన్ డెన్ 80 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నాడు. ఎమర్జన్సీ కాల్ కు అటెండ్ అయ్యే క్రమంలో.. స్పీడ్ గా వెళ్లొచ్చు.. కాకపోతే కొన్ని నిబంధనలు పాటించాలి. కంటిన్యూగా సైరన్ మోగించాలి. కంటిన్యూగా సైరన్ మోగించకుండా.. అప్పుడప్పుడు సైరన్ వేశారు. ఎమర్జెన్స్ లైట్లు ఆన్ చేసే ఉన్నాయి.
ఈ యాక్సిడెంట్ తర్వాత డ్రైవింగ్ చేస్తున్న పోలీస్ అధికారి కెవిన్ డేవ్ పక్క సీట్లో కూర్చున్న మరో అధికారితో మాట్లాడిన మాటలు.. నేరం తర్వాత అతని ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. రోడ్డు దాటుతున్న జాహ్నవి కందులను ఢీకొట్టిన తర్వాత.. పెద్దగా నవ్వుతాడు పోలీస్ అధికారి.. గాల్లో లేచిన అమ్మాయి విండ్ షీల్డ్ ను ఢీకొట్టిందని అనుకుంటున్నాను అంటూ సెడన్ బ్రేక్ వేస్తాడు. ఆ తర్వాత ఆమె కారు నుంచి ఎగిరిపోయింది అంటూ నవ్వుతూ కామెంట్ చేయటంతోపాటు.. పెద్దగా నవ్వుతాడు.. కందులకు పరిమితి విలువ ఉంది అంటూ కామెంట్ చేస్తాడు..
ఈ కేసులో 2024లో లోయర్ కోర్టు తీర్పు ఇచ్చింది. పోలీస్ అధికారిపై తీవ్రమైన నేరారోపణలు నమోదు చేయటానికి నిరాకరిస్తూ.. నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా 5 వేల డాలర్ల ఫైన్ విధిస్తుంది కోర్టు. అదే విధంగా పెట్రోల్ డ్యూటీ నుంచి తొలగించి.. ఆఫీస్ డ్యూటీకి మార్చింది కోర్టు. ఈ తీర్పును సవాల్ చేసింది జాహ్నవి కందుల ఫ్యామిలీ.
నష్టపరిహారం 110 మిలియన్ డాలర్లు.. అంటే 900 కోట్ల రూపాయలుపై మాటే.. దీనిపై విచారణ చేసింది సియాటిల్ సిటీ న్యాయవాది.. జాహ్నవి కందుల ఫ్యామిలీతో ఒప్పందం చేసుకున్నారు. నష్టపరిహారంగా 29 మిలియన్ డాలర్లు చెల్లించటానికి ఓకే అన్నారు. భారతీయ కరెన్సీలో దీని విలువ 262 కోట్ల రూపాయలు. ఇందులో సగం డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రానున్నాయి. ఆమె మరణం ఊహించలేని బాధ అని.. ఎంతో ఉన్నతమైన జీవితం ఉన్న జాహ్నవికి ఇలా జరగటం దారుణం అని.. వారి ఫ్యామిలీ బాధను గుర్తించి.. ఈ నష్టపరిహారం ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు సియాటిల్ సిటీ లాయర్.
