- సీఎంతో గొడవలే కారణం అంటూ రూమర్స్
- రూమర్స్‌ను తిప్పికొట్టిన సింధియా
భోపాల్: 18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉండి, మధ్యప్రదేశ్‌లో కీలక నేతగా ఎదిగి, ఇటీవల బీజేపీలో చేరిన జ్యోతి రాదిత్య సింధియా ట్విట్టర్ ప్రొఫైల్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరిన సింధియా తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో బీజేపీ పార్టీ పేరును తొలగించారు. దీంతో ఇప్పుడు ఆయన ప్రొఫైల్‌లో పబ్లిక్ సర్వెంట్, క్రికెట్ అంటే ఇష్టం అని మాత్రమే ఉంది. అయితే శివరాజ్‌సింగ్ చౌహాన్ టీమ్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయని, అందుకే ఆయన పార్టీ పేరును తొలగించారనే రూమర్స్ వస్తున్నాయి. కాగా ఆ వార్తలను సింధియా ఖండించారు. బీజేపీతో ఎలాంటి ఇబ్బంది లేదని అని చెప్పారు. ఈ విషయంపై బీజేపీ లీడర్ ప్రధ్యుమ్న సింగ్ తొమార్ కూడా స్పందించారు. ట్విట్లర్ ప్రొఫైల్ మార్పుపై వస్తున్న వార్తలు నిజమైనవి కాదు అని, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ అని తీసేశారని ఆ తర్వాత బీజేపీ అని పెట్టలేదని చెప్పారు. దాదాపు 18 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్న గుణ మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఈ ఏడాది మార్చి 11న బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు అనుకూలంగా ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మద్దతు పలికారు.

