షాద్ నగర్ కొత్త సీఐగా కె. సీతారాం

షాద్ నగర్ కొత్త సీఐగా కె. సీతారాం

షాద్ నగర్​, వెలుగు: షాద్ నగర్ పట్టణ కొత్త సీఐగా కె. సీతారాం గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఏడాదిన్నర కాలంగా విధులు నిర్వహించిన సీఐ విజయ్ కుమార్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్​కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో సీతారాం నియమితులయ్యారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సీతారాం తెలిపారు.