ఆలస్యంగా వెళ్లిన పాల్..నామినేషన్ నిరాకరణ

ఆలస్యంగా వెళ్లిన పాల్..నామినేషన్ నిరాకరణ

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు భీమవరంలో చుక్కెదురైంది. ఆలస్యంగా రావడంతో.. ఆయన నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సెల్ఫీల గోలలో పడి.. పాల్ ఆలస్యంగా చేరుకున్నారు. ఐతే.. నరసాపురంలో ఎంపీ స్థానానికి నామినేషన్ ఆలస్యంగా తీసుకున్నారని.. అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని పాల్ చెప్తున్నారు. తాను గెలుస్తానన్న భయంతోనే.. ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆలస్యంగా భీమవరం చేరుకునేలా చేశారని పాల్ విమర్శించారు. నరసాపురం ఎంపీగా గెలిచి తానేంటో నిరూపిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తన తరుఫున ఓ ప్రతినిథి పత్రాలతో మధ్నాహ్నం 2.40 గంటలకు ఎన్నికల అధికారుల దగ్గరకు వెళ్లాడన్నారు. అయితే కొద్దిసేపటికే తాను అక్కడికి చేరుకున్నప్పటికీ సమయం అయిపోయిందని తెలిపారన్నారు. నామినేషన్ తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు పాల్.