మునుగోడు బైపోల్: రైతులతో కలిసి పత్తేరిన కేఏపాల్

మునుగోడు బైపోల్: రైతులతో కలిసి పత్తేరిన కేఏపాల్

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాలా ఉత్సహంగా పాల్లొంటున్నారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న డాన్స్ చేస్తూ, చెప్పులు కుడుతూ కనిపించిన పాల్... తాజాగా రైతుగా మారారు. తలకు కండువా ధోతి కట్టుకుని సైకిల్ ఎక్కారు. ఆ తరువాత చేనులోకి వెళ్లి రైతులతో కలిసి పత్తి ఏరారు. రైతుల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. తాను మునుగోడులో పోటీ చేస్తుంది రైతులను ఆదుకోవడానికేనన్నారు. మునుగోడులో తనని గెలిపిస్తే యువత అందరికీ ఉద్యోగాలు ఇస్తానని, మండాలనికో ఆస్పత్రి, కళాశాల నిర్మిస్తానని తెలిపారు.

  

ముునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుడండంతో పార్టీలన్ని జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నవంబర్ 3న జరగనున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు 6న వెలువడనున్నాయి. కేఏపాల్ తో పాటుగా మొత్తం బరిలో 47 మంది ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.