చిన్నారిపై లైంగిక దాడి కేసులో 25 ఏండ్లు జైలు

చిన్నారిపై లైంగిక దాడి కేసులో 25 ఏండ్లు జైలు

బషీర్​బాగ్, వెలుగు: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ 50 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాచిగూడ సీఐ జ్యోత్స్న తెలిపిన ప్రకారం.. కాచిగూడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి త్రిలోక్​సింగ్​(50) 2024 జూన్ 21న ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

పోలీసులు అతడిపై పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో నాంపల్లి న్యాయస్థానం బుధవారం విచారించి నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది.