ఉత్సాహంగా కాకా క్రికెట్‌‌‌‌ టోర్నీ.. విశాక ఇండస్ట్రీస్, హెచ్ సీ ఐ ఆధ్వర్యంలో నిర్వహణ

ఉత్సాహంగా కాకా క్రికెట్‌‌‌‌ టోర్నీ.. విశాక ఇండస్ట్రీస్, హెచ్ సీ ఐ ఆధ్వర్యంలో నిర్వహణ
  • వరంగల్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్‌‌‌‌ ఉమ్మడి జిలాల్లో పోటీలు
  • మ్యాచ్‌‌‌‌లను ప్రారంభించిన పలువురు ప్రముఖులు

వెలుగు నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ : విశాక ఇండస్ట్రీస్‌‌‌‌, హెచ్‌‌‌‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్‌‌‌‌ టీ 20 క్రికెట్‌‌‌‌ టోర్నీ బుధవారం పలు జిల్లాల్లో ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌‌‌‌ మండలం 13వ బెటాలియన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌లో జరిగిన టోర్నీని బెటాలియన్‌‌‌‌ కమాండెంట్‌‌‌‌ వెంకటరాములు ప్రారంభించారు.

 ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా స్థాయిలో నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్‌‌‌‌, నిర్మల్‌‌‌‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలకు చెందిన జట్లు పోటీల్లో తలపడుతున్నాయి. మొదటి రోజు జరిగిన ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో నిర్మల్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాల జట్లు తలపడగా.. మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసిన నిర్మల్‌‌‌‌ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 141 రన్స్‌‌‌‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆదిలాబాద్‌‌‌‌ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 రన్స్‌‌‌‌ చేసి విజయం సాధించింది. మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌గా చందన్‌‌‌‌ ఎంపికయ్యాడు. 

రెండో మ్యాచ్‌‌‌‌లో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జట్లు తలపడగా... ఆసిఫాబాద్‌‌‌‌ జట్టు మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసి ఆరు వికెట్లు కోల్పోయి 119 రన్స్‌‌‌‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు దిగిన మంచిర్యాల జట్టు కేవలం ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్‌‌‌‌ మాత్రమే కోల్పోయి 121 రన్స్‌‌‌‌ చేసి విజయం సాధించింది. నిఖిల్‌‌‌‌ సాయి మ్యాన్ ఆఫ్‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌గా ఎంపికయ్యాడు. 

 సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న కాక వెంకటస్వామి ఇంటర్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ టోర్నీలో భాగంగా బుధవారం రెండు మ్యాచ్‌‌‌‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌‌‌‌లో సిద్దిపేట, సంగారెడ్డి జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన సిద్దిపేట జట్టు 18.2 ఓవర్లలో 21 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు దిగిన సంగారెడ్డి జట్టు 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంగారెడ్డి జట్టుకు చెందిన శ్రీధర్ 2 వికెట్లు తీయడంతో పాటు 34 పరుగులు చేయడంతో మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌గా ఎంపికయ్యాడు. 

రెండో మ్యాచ్‌‌‌‌లో సిద్దిపేట, మెదక్‌‌‌‌ జట్లు పోటీ పడగా... సిద్దిపేట జట్టు 180 పరుగులకు ఆల్‌‌‌‌ అవుట్‌‌‌‌ కాగా... మెదక్‌‌‌‌ జట్టు 17. 2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించి ఫైనల్‌‌‌‌కు చేరింది. రెండు వికెట్లు తీసి 24 పరుగులు చేసిన రహమత్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌గా నిలిచాడు. ఈ నెల 26న సంగారెడ్డి మెదక్‌‌‌‌ జట్ల మధ్య ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ జరగనుంది.

 ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్‌‌‌‌ టీ 20 క్రికెట్‌‌‌‌ లీగ్‌‌‌‌ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలోని మొగిలిచెర్ల, జనగామ జిల్లాలోని వంగాలపల్లి, ములుగు జిల్లా జాకారం గ్రౌండ్‌‌‌‌లో రెండు సెషన్స్‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌లు జరిగాయి. జనగామ జిల్లా వంగాలపల్లి గ్రౌండ్‌‌‌‌లో జరిగిన పోటీలను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్‌‌‌‌ క్రికెగట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌‌‌‌ ప్రారంభించారు. వంగాలపల్లిలో ఉదయం జరిగిన మ్యాచ్‌‌‌‌లో వరంగల్ జిల్లా జట్టు మహబూబాబాద్‌‌‌‌పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మహబూబాబాద్‌‌‌‌ జట్టు 122 పరుగులు చేయగా... వరంగల్‌‌‌‌ టీమ్‌‌‌‌ 13.4 ఓవర్లలోనే టార్గెట్‌‌‌‌ను చేరుకుంది.  

మొగిలిచెర్లలో హనుమకొండ, భూపాలపల్లి జిల్లా జట్లు తలపడ్డాయి. ఇందులో హనుమకొండ జట్టు 161 పరుగులు చేయగా.. భూపాలపల్లి టీమ్ 10 ఓవర్లలో 61 పరుగులకే అలౌట్ అయింది. దీంతో 100 పరుగుల తేడాతో హనుమకొండ టీమ్‌‌‌‌ విజయం సాధించించింది. జాకారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ములుగు, జనగామ జిల్లాలు తలపడగా.. జనగామ 127 పరుగులకు అలౌట్ అయ్యింది. దీంతో ములుగు జిల్లా జట్టు 18.4 ఓవర్లలో 128 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌‌‌‌లో మొగిలిచెర్లలో హనుమకొండ, వరంగల్ జిల్లాలు తలపడగా.. హనుమకొండ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 

వరంగల్ జిల్లా 140 పరుగులకే పరిమితం కాగా.. 36 రన్స్ తేడాతో హనుమకొండ విజయాన్ని అందుకుంది. జాకారంలో భూపాలపల్లి, ములుగు జిల్లాలకు జరిగిన మ్యాచ్‌‌‌‌లో నిర్ణీత ఓవర్లలో భూపాలపల్లి జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేయగా.. ములుగు జట్టు 16.3 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌట్‌‌‌‌ అయింది. దీంతో 94 పరుగుల తేడాతో భూపాలపల్లి ఘన విజయం సాధించింది. 

వంగాలపల్లిలో మహబూబాబాద్, జనగామ జిల్లాలు పోటీ పడగా.. మహబూబూబాబాద్ జట్టు 13.3 ఓవర్లలో 61 రన్స్ చేసింది. జనగామ జిల్లా జట్టు కేవలం 5.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని చేజిక్కించుకుంది.

 ఖమ్మం నగరంలోని వైఎస్సార్‌‌‌‌ నగర్‌‌‌‌ సమీపంలో ఉన్న గ్రౌండ్‌‌‌‌లో బుధవారం కాకా మెమోరియల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ టోర్నీ ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు బుధవారం రెండు సెషన్స్‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌లు నిర్వహించారు. ఉదయం జరిగిన మ్యాచ్‌‌‌‌లో మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఖమ్మం జట్టు 15 ఓవర్లలో 107 రన్స్‌‌‌‌ చేసింది. తర్వాత భద్రాద్రి జిల్లా జట్టు 83 రన్స్‌‌‌‌కే ఆల్‌‌‌‌ అవుట్‌‌‌‌ కావడంతో ఖమ్మం టీమ్‌‌‌‌ 24 రన్స్‌‌‌‌తో విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌‌‌‌లో మొదట ఖమ్మం జిల్లా జట్టు 17 ఓవర్లలో 117 రన్స్‌‌‌‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన భద్రాద్రి కొత్తగూడెం టీమ్‌‌‌‌ 7 పరుగులతో గెలిచింది.  

 కాకా మెమోరియల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ టోర్నీలో భాగంగా బుధవారం ఉదయం యాదాద్రి, సూర్యాపేట జట్ల మధ్య మ్యాచ్‌‌‌‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసిన యాదాద్రి జట్టు 157 పరుగులు చేసింది. సూర్యాపేట జట్టు 118 పరుగులకే ఆలౌట్‌‌‌‌ కావడంతో 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌‌‌‌లో నల్గొండ, యాదాద్రి జట్లు తలపడగా నల్గొండ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 244 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన యాదాద్రి జట్టు 197 పరుగులు చేసింది. దీంతో 47 పరుగుల తేడాతో నల్గొండ టీమ్‌‌‌‌ విజయం సాధించింది. 

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని ఎంసీఏ స్టేడియంలో బుధవారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌‌‌‌లో నాగర్​కర్నూల్, గద్వాల జిల్లాల జట్లు తలబడ్డాయి. మొదట నాగర్‌‌‌‌కర్నుల్‌‌‌‌ జట్టు బ్యాటింగ్‌‌‌‌ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 118 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌ చేసిన గద్వాల టార్గెట్‌‌‌‌ను ఛేదించి విజేతగా నిలిచింది. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌‌‌‌లో వనపర్తి, నారాయణపేట జట్లు పోటీ పడగా... మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసిన నారాయణపేట 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 169 రన్స్‌‌‌‌ చేసింది. తర్వాత వనపర్తి 14.3 ఓవర్లలో 94 పరుగులకే ఆల్‌‌‌‌ అవుట్‌‌‌‌ అయింది. దీంతో నారాయణపేట టీమ్‌‌‌‌ విజయం సాధించింది.

కరీంనగర్‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌‌‌ మండలంలోని అలుగునూరులో గల వెలిచాల జగపతిరావు క్రికెట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక పోటీలు రెండో రోజైన బుధవారం ఉత్సాహంగా సాగాయి. ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌‌‌‌లో రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసిన రాజన్న సిరిసిల్ల జట్టు 19.5 ఓవర్లలో 158 పరుగులకు ఆల్‌‌‌‌ అవుట్‌‌‌‌ అయింది. తర్వాత పెద్దపల్లి జట్టు 16.2 ఓవర్లలో 74 పరుగులకు ఆల్‌‌‌‌ అవుట్‌‌‌‌ కావడంతో రాజన్న సిరిసిల్ల టీమ్‌‌‌‌ విజయం సాధించింది.

 మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌‌‌‌లో జగిత్యాల, కరీంనగర్‌‌‌‌ జట్లు తలపడ్డాయి. బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. తర్వాత జగిత్యా జట్టు 41 పరుగులకే ఆల్‌‌‌‌ అవుట్‌‌‌‌ కావడంతో కరీంనగర్‌‌‌‌ టీమ్‌‌‌‌ గెలిచింది.