సర్కార్ దవాఖన్లకు ఆక్సిజన్ అందిస్తున్న ‘కాకా ఫౌండేషన్‘

సర్కార్ దవాఖన్లకు ఆక్సిజన్ అందిస్తున్న ‘కాకా ఫౌండేషన్‘

కరోనా కష్టకాలంలో కాకా ఫౌండేషన్ పేషెంట్లకు అండగా నిలుస్తోంది.ఫౌండేషన్ ఛైర్మన్,పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తున్నారు. గోదావరిఖని ప్రభుత్వ హాస్పత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందజేశారు ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో   బిజెపి జాతీయ ఎస్సి మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.