ఆ స్నేహంతోనే తెలంగాణ కోసం సపోర్ట్ చేసిండు

ఆ స్నేహంతోనే తెలంగాణ కోసం సపోర్ట్ చేసిండు

మేరా సఫర్‌లో కాకా వెంకటస్వామి
మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి మంచి దోస్తులు. పార్టీలో, ఇతర అంశాల్లో కలిసి పనిచేశారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాకా వెంకటస్వామికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో తోడ్పాటు అందించారు. కాకా వెంకటస్వామి తన ఆత్మకథ ‘మేరా సఫర్’లో ఈ విషయాలను వెల్లడించారు. తమ స్నేహాన్ని, తెలంగాణ అంశానికి సంబంధించిన

కొన్ని ఘటనలను ఆయన వివరించారు. కాకా చెప్పిన ఆ ముచ్చట్లు..

‘‘నాకు (కాకా వెంకటస్వామి) కాంగ్రెస్ లో, సుదీర్ఘ రాజకీయ జీవితంలో మంచి స్నేహితుడని చెప్పాలంటే ప్రణబ్ ముఖర్జీ పేరే చెప్పాలి. పార్టీలో కలిసే పనిచేసినం. అట్లనే ఇందిరా గాంధీ కేబినెట్లో ఒకేసారి మంత్రులుగా ఉన్నం. ప్రణబ్ రాష్ట్రపతి అయినందుకు అందరికంటే ఎక్కువ సంతోషించినవాణ్ని నేనే. నా మనవడు వంశీ ఒకసారి ఆయన్ను కలిసిండు. అప్పుడు ప్రణబ్ ఒక్కటే చెప్పిండట. ‘నాకు జీవితంలో ఉన్న ప్రాణస్నేహితులు ఇద్దరే. ఒకరు మీ తాత వెంకటస్వామి. మరొకరు జానకీ వల్లభ్ పట్నాయక్ (ఒడిశా లీడర్ జేబీ పట్నాయక్)’’ అన్నరట. అదే స్నేహంతో తెలంగాణ ఇవ్వడానికి కూడా చాలా సపోర్ట్ చేసిండు. ప్రణబ్ స్నేహాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను.

అమ్మా తెలంగాణ ప్రజల కోరికేందో నీకు తెలియంది కాదు. ఆ డిమాండ్ తోనే అక్కడ ఓ పార్టీ పుట్టింది. వాళ్లతో పొత్తు పెట్టుకుంటే మంచిగ ఉంటది” అని సోనియా గాంధీకి చెప్పిన. దాంతో పొత్తు గురించి ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడాలని ఆమె చెప్పారు. తర్వాత ప్రణబ్ ముఖర్జీ, నేను చాలా కష్టపడి సోనియా గాంధీకి నచ్చజెప్పి పొత్తు కుదిరించినం. ఇది కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు నచ్చలేదు. నన్ను విమర్శించిన్రు. కానీ తెలంగాణ సాధించడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి ఇదే మార్గమని టీఆర్ఎస్ తో పొత్తు చేయించిన.

For More News..

రెండుసార్లు చేజారిన పీఎం చాన్స్

సీఎం ఆదేశాలతోనే మొహర్రం ర్యాలీ