- 1500 బహుమతుల్లో రూ. 10 లక్షల ధరతో టాప్ 3లో స్థానం
- వేలంలో ప్రధానికి తెలంగాణ నేతలు కానుకగా ఇచ్చిన మరో14 గిఫ్ట్‌లు
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ దేశాలు, రాష్ట్రాల పర్యటనల సందర్భంగా వచ్చిన గిఫ్ట్‌ల ఈ– వేలంలో తెలంగాణకు చెందిన కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 1500 గిఫ్టుల్లో రూ. 10 లక్షల బిడ్‌తో టాప్ 3లో స్థానం దక్కించుకుంది. కేంద్రం నిర్వహిస్తున్న ఈ వేలం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఇందులో ప్రత్యేకమైన జ్ఞాపికలు, సాంప్రదాయ కళాఖండాలు, దేవుడి విగ్రహాలు, ఆలయ ప్రతిరూపాలు, ప్రధాని మోదీ చిత్ర పటాలు, క్రీడాకారుల జ్ఞాపికలు వేలానికి ఉంచారు. 2018 నుంచి నిర్వహిస్తోన్న ఈ వేలం పాటతో వచ్చిన డబ్బుతో కేంద్రం ‘నమామి గంగా’ ప్రాజెక్ట్ కు ఖర్చు చేసింది.
మెరిసిన ‘తెలంగాణ తోరణం’...
దాదాపు 1500 వందల బహుమతులతో ఈ–వేలంలో తెలంగాణకు చెందిన కాకతీయ కళాతోరణం మెరిసింది. అన్ని బహుమతుల్లో మూడవ కాస్లీ గిఫ్ట్ గా ప్రత్యేకత సంతరించుకుంది. వెండితో తయారు చేయబడిన ఈ కాకతీయ కళా తోరణానికి(వేలం ఐడీ 26 ఏ 0205) బిడ్ లో కేంద్రం రూ. 9 లక్షలుగా ధరను నిర్ణయించింది. అయితే.. ఇప్పటికే వరకు ఈ గిఫ్ట్ కోసం అత్యధికంగా రూ. 10 లక్షల బిడ్ దాఖలైంది. ఈ వేలంలో రూ. 21 లక్షల అత్యధిక బిడ్ ధరతో ‘రథంపై జగన్నాథ్ పరివార్’(26ఏ 0554) ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దీనికి ముగ్గురు బిడ్ లు దాఖలు చేయగా... కేంద్రం కేవలం రూ. 6 లక్షల ప్రాథమిక ధరను దీనికి నిర్ణయించింది. కర్ణాటక నేతలు ఇచ్చిన శ్రీరాముడి వెండి జ్ఞాపికకు(26ఏ0214) రూ. 13,50, 200 లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే... ఈ విగ్రహానికి రూ. 13, 50,000 లుగా వేలం ధర నిర్ణయించగా... ఆక్షన్ లో పాల్గొన్న ఇద్దరూ... వంద రూపాయలు మాత్రమే పెంచుతూ బిడ్ లు వేసారు. రూ. 7.50 లక్షలతో జీవ వృక్షం గోండ్ ఆర్ట్, రూ. 6.5 లక్షలతో 99.99 స్వచ్ఛమైన బంగారు పూత పూసిన రాధా కృష్ణ కళాకృతి, రూ. 3 లక్షలతో ఆటోగ్రాఫ్ చేసిన ఇండియన్ పారా టేబుల్ టెన్నిస్ టీమ్ జెర్సీ, మోదీ చిత్రం, శ్రీ రంగ నాథస్వామి తంజావూరు శైలి ఫ్రేమ్డ్ పెయింటింగ్, ఇతర బహుమతులు వరుసగా ఉన్నాయి. అతి తక్కువగా రూ.1500 లకు పత్రికలలో వచ్చిన ఫ్రేమ్ ను వేలం పెట్టారు.
ప్రత్యేకంగా ఆకర్షణగా తెలంగాణ బహుమతులు...
కాకతీయ కళా తోరణమే కాకుండా... తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తో పాటు రాష్ట్ర నేతలు ఇచ్చిన దాదాపు 14 వస్తువులను ఈ వేలంలో అమ్మకానికి పెట్టారు. ఇందులో అత్యధికంగా చెర్యాల పెయింటింగ్(26ఏ0347)కు రూ. 54, 100, చిన్న కాకతీయ కళా తోరణం(26a1298) కు రూ. 30,700, లార్డ్ రాం(26ఏ0055)కు రూ. 20, 900, వరంగల్ గేట్ & అంబేడ్కర్(26ఏ0103)కు రూ. 9 వేల బిడ్ లు దాఖలు అయ్యాయి. కాగా... లార్డ్ హనుమాన్(26ఏ0006) విగ్రహానికి అత్యధికంగా 32 బిడ్ లు దాఖలయ్యాయి. ప్రాథమికంగా ఈ విగ్రహానికి రూ.3000 నిర్ణయించగా... అత్యధికంగా రూ. 8, 300 లకు బిడ్ దాఖలైంది. గార్డ్ లక్ష్మీ పట్ట చిత్రం (26ఏ0412)రూ. 1500, కురవి వీరభద్ర స్వామీ(26a0524)కు రూ. 8,100, సర్దార్ వల్లభాయి పటెల్ నేషనల్ పోలీస్ అకాడమీ(26ఏ1187) కు రూ. 6000, సీడ్ ఆర్ట్ నరేంద్ర మోదీ(26ఏ 1495)కు రూ. 10,500 ప్రాథమిక ధలలతో ఇతర గిఫ్ట్ లు వేలంలో ఉన్నాయి.
ప్రజాసేవకు మొగ్గుచూపేవారినేప్రభుత్వ సర్వీసుల్లోకి తీస్కోవాలి
ప్రభుత్వ పదవుల కన్నా ప్రజా సేవ పట్ల అంకితభావంతో ఉన్న యువతను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సర్వీసుల నియామక పరీక్షలు.. అభ్యర్థి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా వారు సివిల్ సర్వీసెస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారో కూడా అంచనా వేసేలా ఉండాలని సూచించారు. నియామకాల విధానంలో సమూల మార్పులు రావాలన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. కేవలం అకడమిక్ పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా, అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ పై ఎంతటి ప్రేరణ ఉందనే దానిని అంచనా వేసేలా ఎంపిక విధానం ఉండాలని అన్నారు.
