కరువుపై అధ్యయనానికి  కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగులకు 2 డీఏలు.. వాయిదాల్లో ఎరియర్స్  

కరువుపై అధ్యయనానికి  కేబినెట్ సబ్ కమిటీ  ఉద్యోగులకు 2 డీఏలు.. వాయిదాల్లో ఎరియర్స్  
  • 235 మండలాల్లో కరువు పరిస్థితులు
  • అఖిల పక్షం తర్వాత ఢిల్లీకి మంత్రుల బృందం
  • ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుదామన్న కేబినెట్
  • 7,800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఆమోదం
  • కోతల్లేకుండా కరెంటు సరఫరా చేయాలని నిర్ణయం
  • 65 లక్షల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి
  • డిజిటల్ మీడియా పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 

 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కరువు పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్‌‌‌‌కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణులతో భేటీ నిర్వహించి తక్షణ ఉపశమన చర్యలను సిఫార్సు చేస్తుందని తెలిపింది. ఈ వానాకాలంలో 17 శాతం లోటు వర్షపాతంతో రాష్ట్రంలోని 235 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నందున వాటిని కరువు మండలాలుగా ప్రకటించి, రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

కరువుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, కేంద్ర సాయం కోసం త్వరలో మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని నిర్ణయించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులను పునఃసమీక్షించి, ఈపీసీ విధానంలో చేపట్టిన అసంపూర్తి ప్రాజెక్టులను రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియెట్‌‌‌‌లో జరిగిన సమావేశంలో ఎల్‌‌‌‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్‌‌‌‌, ఉద్యోగులకు రెండు డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్ వివరాలు వెల్లడించారు. 


కరువుపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ

ఈ వానాకాలంలో 17 శాతం లోటు వర్షపాతంతో 235 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయ ని. త్వరలో అఖిలపక్ష భేటీ నిర్వహించి కేంద్ర సాయం కోసం మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. కరువు పరిస్థితులపై లోతుగా అధ్య యనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయ నున్నట్లు చెప్పారు. రైతు సంఘాలు, వివిధ రంగాల ని పుణులతోభేటీ నిర్వహించి తక్షణ ఉపశమన చర్యలను సిఫార్సు చేస్తుందని తెలిపారు.

విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై స్పెషల్ ఫోకస్

కరువు నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టా లని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. పంటలు ఎండిపో వడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా తలెత్తుతోందని చెప్పారు. రాష్ట్రంలో సాధారణం గా రోజుకు 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందన్నారు. గతేడాది గరిష్ట డిమాండ్ 16,613 మెగావాట్లుగా ఉందని వివ రించారు.

డిమాండ్ పెరుగుతున్నా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా కరెంట్ను కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి. విద్యుత్ సమీకరణపై దృష్టి పెట్టామని, 7,800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త యూనిట్ల ఏర్పా టుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఇందులో 3 వేల మెగావాట్ల సోలార్, 4వేల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో వీటిని చేపడతామని చెప్పారు.

హామీ మేరకు డీఏ, డీఆర్

ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. 2024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండింటిని వెంటనే మంజూరు చేసి, అప్పటి నుంచి బకాయి పడిన ఏరియర్ను వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్థికంగా భారమైనప్పటికీ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మం జూరు చేసినట్లు చెప్పారు. దీంతో ప్రతి ఏడాది ప్రభు త్వంపై రూ.2,500 కోట్ల భారం పడుతుందన్నారు.


ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారన్నారు. ఈ సీజన్లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని సివిల్ సప్లయిస్ విభాగం అంచనా వేసిందన్నారు. అలాగే, కేబినెట్ సమావేశంలో 22ఏకు సంబంధించిన అంశాలపై వివరంగా చర్చించారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయా లు, అమలవుతున్న తీరుపై మంత్రి పొంగులేటి కేబినె టక్కు వివరించారు.

మరికొన్ని నిర్ణయాలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది.

తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్లు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనను పరిశీ లించింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టై జ్మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ పాలసీకి ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిష నర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో నలుగురు గ్రూప్ 1 అధికారులను కూడా నియమిం చాలని నిర్ణయించింది.