గాంధీనగర్: ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌లో ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చర్‌కు ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’ అందజేయనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గురువారం ప్రకటించారు. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఆయన ధైర్యం, అంకితభావం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
మచ్చర్ స్వస్థలం గుజరాత్ అని, ఆయన కుటుంబం ముంబైలో స్థిరపడిందని అధికారులు తెలిపారు. మచ్చర్ త్వరగా కోలుకోవాలని సోమనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘మహామృత్యుంజయ మంత్ర జపం’ చేపట్టారు.
