భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం SI భవానీసేన్పై తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంది. SI భవానీసేన్ను డిస్మిస్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించినట్లు నిర్ధారణ కావడంతో సర్కార్ యాక్షన్ తీసుకుంది.
కాళేశ్వరం భవానీ సేన్ సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెట్టి తనపై లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ అదే ఠాణాలో పనిచేస్తున్న మహిళా కనిస్టేబుల్ జూన్ 18న రాత్రి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేకి ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు నిన్న అర్థరాత్రి ఎస్సై భవానీ సేన్ ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి భూపలపల్లి జిల్లా ఠాణాకు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అతని దగ్గరి నుంచి సర్వీస్ రివాల్వర్ ను స్వాధీనం చేసుకుని డిస్మీస్ చేశారు. 311 ఆర్టికల్ ప్రకారం సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈయనపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి.
