బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలోనే కాళేశ్వరానికి నష్టం

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలోనే కాళేశ్వరానికి నష్టం
  •     అప్పుడు స్పందించని లీడర్లు.. ఇప్పుడు సలహాలిస్తున్నరు
  •     మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు భారీ నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. అప్పడు స్పందించని లీడర్లు ఇప్పుడు నష్ట నివారణ, నీటి సరఫరాపై ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేటలో శనివారం మీడియాతో మాట్లాడారు. రూ.90 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌కు జరిగిన నష్టంపై రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏతో విచారణ చేయిస్తున్నామన్నారు.

ఆ సంస్థ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం బారేజీలను పరిశీలిస్తున్నారని, వారికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం తరఫున అందజేస్తున్నట్లు చెప్పారు. ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ విచారణ అంశాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాల కోసం ఇప్పటికే సుమారు 80 లక్షల మందిని ఎంపిక చేశామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఇప్పుడు పథకం అందని వారు అధైర్యపడొద్దని సూచించారు.