- నాన్ సర్వీస్ స్టూడెంట్లకు ఈ నెల 30 దాకా చాన్స్
- ఇన్ సర్వీస్ డాక్టర్లకు ఇవ్వాల్నే లాస్ట్
హైదరాబాద్, వెలుగు: కన్వీనర్ కోటా కింద పీజీ సీట్లు పొందిన నాన్ -సర్వీస్ అభ్యర్థులు తమ సీటును వదులుకోవడానికి(ఫ్రీ ఎగ్జిట్)ఉన్న గడువును కాళోజీ హెల్త్ వర్సిటీ పొడిగించింది. 2025–26 సంవత్సరానికి గానూ పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో సీట్లు పొందిన నాన్ -సర్వీస్(ప్రైవేట్) అభ్యర్థులకు ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు, ఇన్- సర్వీస్(ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేసే) డాక్టర్లకు పాత గడువు ప్రకారం ఈ నెల 23 సాయంత్రం 4 గంటల లోపు చాన్స్ఇచ్చింది. స్టూడెంట్లు సీట్లు వదులుకుంటే వెంటనే ఆన్ లైన్ లో అప్డేట్ చేయాలని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లను వర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశించారు.
