కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై కమల్ రియాక్షన్

కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై కమల్ రియాక్షన్

కమల్ హాసన్  పొలిటికల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్నిఆ పార్టీ ట్విట్టర్లో తెలిపింది. ప్రజాస్వామ్య  గొంతుకను అణచివేసేందుకు కొందరు ఈ హ్యాకింగ్ కు పాల్పడ్డారని..దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

జనవరి 30న మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధికారికంగా కాంగ్రెస్ లో విలీనం అవుతున్నట్లు వెబ్ సైట్లో ఓ ప్రకటన వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన  పార్టీ తమ వెబ్ సైట్ హ్యాక్ అయ్యిందని వెల్లడించింది. ప్రస్తుతానికి   సైట్ ను మూసివేశామని చెప్పింది. కాంగ్రెస్ లో విలీనం అయ్యే ప్రసక్తే లేదని  ఆ పార్టీ అధికార ప్రతినిధి మురళీ అబ్బాస్ తేల్చి చెప్పారు. అలాంటి  ఆలోచనలు లేవని.. ఇందులో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఎవరో తమ వెబ్‌సైట్ హ్యాక్ చేశారని  చెప్పారు.

ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రలో కమల్  హాసన్ పాల్గొన్నారు.  కాంగ్రెస్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో కమల్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.  2018లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. 2021 లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.