ఛలో ఛలో కమలమ్మ... వయ్యారి ఛలో కమలమ్మ..స్టెప్పులతో ఇరగదీసింది

ఛలో ఛలో కమలమ్మ... వయ్యారి ఛలో కమలమ్మ..స్టెప్పులతో ఇరగదీసింది

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ (58) తాజాగా వైట్ హౌస్ లో చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. వైట్ హౌస్ లో హిప్ హాప్స్ 50వ వార్షికోత్సవాన్ని ఆమె నిర్వహించారు.అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారీస్ 2021, జనవరి 20 నుంచి కొనసాగుతున్నారు. అవసరమైతే తాను అమెరికా అధ్యక్షురాలిగా సేవలు అందించడానికి సిద్ధమని ఇటీవలే ప్రకటన చేశారు.

వైట్‌హౌస్‌లో ఇటీవలే హిప్ హాప్‌ (Hip-Hop) 50వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హ్యారిస్‌.. రంగురంగుల చొక్కా, పింక్‌ కలర్‌ ప్యాంట్‌ ధరించి సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని పొలిటికల్ కామెంటేటర్ (Political Commentator) ఆంథోనీ బ్రియాన్ లోగాన్ (Anthony Brian Logan) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఆ డ్యాన్స్‌ను చూడలేకపోతున్నాం’, ‘ఆమె అచ్చం భామ్మలా డ్యాన్స్‌ చేస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

1999లో క్యూ-టిప్ హిట్ “వివ్రాంట్ థింగ్” కి హారిస్ డ్యాన్స్ చేశారు. హాట్ పింక్ స్లాక్స్‌,  90ల నాటి నియాన్ బ్లౌజ్‌ని ధరించి చేసిన ఆమె స్టెప్పులు విమర్శలకు తావిచ్చాయి. కోరస్‌కు మించిన సాహిత్యం ఆమెకు తెలియదంటూ  సోషల్ మీడియాలో  చాలామంది ఎగతాళి చేసారు. ప్యూర్ క్రింగ్ అని  కొందరు కాకిల్ షఫుల్ గా  విమర్శలు వెల్లువెత్తాయి. కాగా హారిస్ డాన్స్‌పై విమర్శలు  చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. జూన్‌లో, బ్రావో వాచ్ వాట్ హాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్ లో డ్యాన్స్‌, ఇబ్బందికరమైన నవ్వుపై నెటిజన్లు వ్యాంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే.

హారిస్ డ్యాన్స్ మూవ్‌లు ఆన్‌లైన్‌లో ఎగతాళికి గురి కావడంపై స్పందించిన కొంతమంది పబ్లిక్ ఫిగర్‌లు కూడా మనుషులే అని గుర్తుంచు కోవాలి. అంటున్నారు.  సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం,వ్యక్తిగతంగా కొంత సమయాన్ని ఆస్వాదించడానికి వారూ అర్హులే అని వ్యాఖ్యానించారు.