అక్షరాభ్యాసం చేయించిన కామారెడ్డి కలెక్టర్

అక్షరాభ్యాసం చేయించిన కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి, వెలుగు: చదువుతోనే  భవిష్యత్​కు బలమైన పునాది ఏర్పడుతుందని కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్​ప్రభుత్వ​స్కూల్​లో యూకేజీ ప్రారంభం సందర్భంగా గురువారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల ప్రగతి కోసం తల్లిదండ్రులు, టీచర్లు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. 

అంతకుముందు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​లో భాగంగా  రెండో విడత ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ భూమి పూజ చేశారు. పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం సొంతింటి కలలను నేరవేరుస్తోందని అన్నారు. డీఈవో మల్లిఖార్జున్, సర్పంచ్​దివ్య తదితరులు పాల్గొన్నారు.