రాముడి నడియాడిన నేలపై చిలిపి కృష్ణులే ఎక్కువ: ఏకపత్నీ వ్రతులు అసలే కాదు.. సర్వే రిపోర్ట్ మైండ్ బ్లోయింగ్

రాముడి నడియాడిన నేలపై చిలిపి కృష్ణులే ఎక్కువ: ఏకపత్నీ వ్రతులు అసలే కాదు.. సర్వే రిపోర్ట్ మైండ్ బ్లోయింగ్

Extra-Marital Affairs: ప్రస్తుతం దేశంలో వివాహేతర సంబంధాలు పెరగటం కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఒకప్పుడు అడపాదడపా పల్లెటూళ్లలో కనిపించిన ఇలాంటి విషయాలు ప్రస్తుతం నగరాల్లో ఎక్కువ అవుతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. పైగా ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ రాక ఇలాంటి కల్చర్ విస్తరణకు కారణంగా మారిందనే వాదనలు కూడా ఉన్నాయి. 

తాజాగా నిర్వహించిన సర్వేలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్న నగరంగా తమిళనాడులోని కాంచీపురం తొలి స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో అక్రమ సంబంధాలు గతంలో కంటే పెరగటంతో ఢిల్లీ, ముంబై వంటి నగరాలను దాటేసి మెుదటి ప్లేస్ సంపాదించిందని ఆష్లీ మ్యాడిసన్ జూలై 2025 డేటా చెబుతోంది. 2024లో 17వ స్థానంలో ఉన్న కాంచీపురం ఏడాది కాలంలోనే ఫస్ట్ ర్యాంక్ కొట్టిందని రిపోర్ట్ తెల్చింది. దేశంలోని టైర్2,3 నగరాలకు డేటింగ్ యాప్స్ విస్తరణ దీనికి కారణంగా తెలుస్తోంది. 

Also Read:-ఆషాఢ అమావాస్య ... పితృ దేవతలు భూమిపై సంచరించే రోజు.. ఇలా చేయండి.. అనుగ్రహిస్తారు..

ఇక రెండవ స్థానంలో సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం నలిచింది. ప్రధానంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయని తేలింది. సెంట్రల్ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, నైరుతి ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడాలోని గౌతమ్ బుద్ధనగర్ టాప్ 20 స్థానాల్లో ఉన్నాయి. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబై మాత్రం టాప్ 20 స్థానాల్లో కనిపించలేదు.

ఇదే క్రమంలో వివాహేత సంబంధాలు అధికంగా ఉన్న నగరాల్లో జైపూర్, రాయగడ్, కమ్పూర్, చంఢీగడ్ నిలిచాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా తమ భాగస్వామిపై నమ్మకాన్ని కోల్పోయినట్లు అంగీకరించడంతో ఆధునిక భారతదేశంలో కూడా సంబంధాలు దెబ్బతింటున్న ధోరణి.. కొత్త పుంతలు తొక్కుతున్న తీరు పెరుగుతున్నట్లు ఆష్లే మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ అన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా వివాహేతర సంబంధాల విషయంలో భారత్ 6వ స్థానంలో ఉందని.. ఈ ఏడాది చివరి నాటికి ఇంకా ముందుకెళ్లొచ్చని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో 53 శాతం మంది తమకు వివాహేతర సంబంధం ఉందని అంగీకరించినట్లు YouGov సర్వే ఫలితాలు చెబుతున్నాయి.