T20 World Cup 2026: కాంట్రాక్ట్ లిస్ట్‌లో లేకపోయినా దేశం కోసం: 2026 టీ20 వరల్డ్ కప్ ఆడతానని కన్ఫర్మ్ చేసిన విలియంసన్

T20 World Cup 2026: కాంట్రాక్ట్ లిస్ట్‌లో లేకపోయినా దేశం కోసం: 2026 టీ20 వరల్డ్ కప్ ఆడతానని కన్ఫర్మ్ చేసిన విలియంసన్

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 2026 టీ20 వరల్డ్ కప్ ఆడతనాన్ని ధృవీకరించాడు. సోమవారం (సెప్టెంబర్ 15) విలియంసన్ పొట్టి ప్రపంచ కప్ ఆడతానని కన్ఫర్మ్ చేశాడు. ఫ్యాబ్-4 ఆడుతున్న వారిలో విలియంసన్ ఒక్కడే ఆడనున్నటు తెలుస్తోంది. కోహ్లీ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. రూట్, స్మిత్ టీ20 జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ కేన్ వద్దనుకున్నారు. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉంటే జాతీయ జట్టు తరపున రెగ్యులర్ ప్లేయర్ గ ఆడాల్సి ఉంటుంది. 

విలియంసన్ మాత్రం అంతర్జాతీయ టీ20 క్రికెట్ లీగ్ లు ఆడాలనే తన కోరికను తెలిపాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో లేకపోయినా ప్రధాన టోర్నీలకు అందుబాటులో ఉంటానని గతంలోనే విలియంసన్ స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2026 ఆడతాని ప్రకటించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 1 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు  కేన్ విలియమ్సన్ ఆడటం లేదు. పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఐసీసీ టోర్నీలో ఫిట్ గా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కేన్ క్లారిటీ ఇచ్చాడు. 

న్యూజీలాండ్ కు కేన్ విలియమ్సన్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ఎన్నో ఐసీసీ టోర్నీల్లో కివీస్ కు నాయకత్వం వహించాడు. 2021 లో ఇండియాపై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిపించిన పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎన్నో సార్లు ఫైనల్ కు తీసుకెళ్లాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో  పేలవ ప్రదర్శన దృష్ట్యా  పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కూడా వదులుకున్నాడు. విలియమ్సన్ 91 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లకు కివీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కాలంలో కివీ జట్టు 47 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు గెలిచింది.  

ALSO READ : IND VS PAK: మ్యాచ్ రిఫరీపై పగపట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఐసీసీకి కంప్లైంట్

2026లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2026 వరల్డ్ కప్ కు 20 జట్లలో ఇప్పటివరకు 15 జట్లు అర్హత సాధించాయి. ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. 2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్-8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఈ లిస్టులో ఉన్నాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ సూపర్-8 కు అర్హత సాధించకపోయినా  ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి.