IND VS PAK: మ్యాచ్ రిఫరీపై పగపట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఐసీసీకి కంప్లైంట్

IND VS PAK: మ్యాచ్ రిఫరీపై పగపట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఐసీసీకి కంప్లైంట్

ఆసియా కప్ లో ఆదివారం (సెప్టెంబర్ 14) పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అలవోక విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే . దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సూపర్-4 కు చేరువైంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుకు టీమిండియా మరో విషయంలో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయారు. టీమిండియా తీరుపై పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండియా టీమ్ పై ఉన్న కోపాన్ని మ్యాచ్ రిఫరీ పై చూపించింది.           

మ్యాచ్ ముగిసిన తర్వాత సోమవారం (సెప్టెంబర్ 15) మ్యాచ్ రిఫరీని టార్గెట్ చేసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) డిమాండ్ చేసింది. భారత జట్టు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి కంప్లైంట్ చేస్తూ ఆ అధికారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. " ఐసీసీ ప్రవర్తనా నియమావళి, క్రికెట్ స్ఫూర్తికి సంబంధించిన MCC చట్టాలను మ్యాచ్ రిఫరీ ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుండి మ్యాచ్ రిఫరీని వెంటనే తొలగించాలని పీసీబీ  డిమాండ్ చేసింది". అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. 

ALSO READ : Duleep Trophy 2025: RCB కెప్టెన్ ఖాతాలో మరో టైటిల్.. దులీప్ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్

టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాను భారత కెప్టెన్ సూర్యకుమార్‌తో కరచాలనం చేయవద్దని కోరినట్లు వార్తలు వచ్చాయని దీంతో అతని ప్రవర్తనపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. "కరచాలనం చేయకపోవడంపై భారత ఆటగాళ్ల ప్రవర్తనపై జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది ఆటకు ఆటంకం కలిగించే చర్యగా.. ఆట స్ఫూర్తికి విరుద్ధమని భావించారు. ఈ కారణంగానే మ్యాచ్ తర్వాత జరిగే ప్రెజెంటేషన్ కు మా కెప్టెన్‌ను పంపలేదు". అని పాక్ క్రికెట్ బోర్డు ప్రకటనలో రాసుకొచ్చింది. 

టాస్ గెలిచిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా.. ఇండియా కెప్టెన్ సూర్య ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. మొదట టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మ్యాచ్ గురించి మాట్లాడి తలదించుకుని వెళ్ళిపోయాడు. ఇండియా కెప్టెన్ సూర్య కూడా సల్మాన్ ను పట్టించుకోలేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు జట్లు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. దీంతో ఇండియా ఫార్మాలిటీగా ఈ మ్యాచ్ ఆడడానికి వచ్చామని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ ఆడకూడదని.. బాయ్ కాట్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ వార్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌పై మళ్లీ టీమిండియాదే పైచేయి అయింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ పోరులో సూర్యకుమార్ సేన 7  వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కుల్దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (2/18), జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా (2/28) దెబ్బకు  తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 127/9 స్కోరు మాత్రమే చేసింది.  అనంతరం బర్త్‌‌డే బాయ్‌‌ సూర్యకుమార్ యాదవ్ (37 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 47 నాటౌట్‌‌‌‌) కెప్టెన్‌‌ ఇన్నింగ్స్‌‌కు తోడు ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31), తిలక్‌‌‌‌ వర్మ (31 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 31) మెరుపులతో ఇండియా 15.5  ఓవర్లోనే 131/3  స్కోరు చేసి గెలిచింది.