Kangana ranaut: మొక్కలు నాటిన కంగనా రనౌత్

Kangana ranaut: మొక్కలు నాటిన కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉంటారు. తాను అనుకున్నది ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఈ ఫైర్ బ్రాండ్ తాజాగా మొక్కలు నాటుతూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‭లో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్ లో మొక్కలు నాటింది. ప్రస్తుతం కంగనా మొక్కలు నాటిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ జ్యోతిష్యుడు బాలు మున్నంగి ఛాలెంజ్‭ను స్వీకరించి మొక్కలు నాటినట్లు కంగనా చెప్పారు. అందరూ మొక్కలు నాటి.. పచ్చదనాన్ని పెంపొందించాలని ఆమె సూచించారు.